సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట్ నియోజకవర్గంలోని పిల్లి గుడిసెలు ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేదు అనుభవం ఎదురయింది. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శిస్తుండగా గతంలో పిల్లి గుడిసెలో నివాసముండి డబల్ బెడ్ రూమ్ రానివాళ్లు ఒకేసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను తమకు న్యాయం చెయ్యాలంటూ తాము కూడా లబ్ధిదారులమంటూ అడిగిన పట్టించుకోకుండా వెళ్లాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జీహెచ్ఎంసి కమిషనర్, MA & UD ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డబల్ బెడ్ రూమ్ లను సందర్శించారు.