సిరాన్యూస్, సైదాపూర్
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బీజేపీ నాయకులు
* తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ వెన్కేపల్లి-సైదాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. మండలంలో కొన్ని చోట్ల సరైన సమయంలో సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందన్నారు.ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పంట నష్టరిహారాన్ని ఇంతవరకు అందివ్వలేదన్నారు.వెంటనే పంట నష్టరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఒక్కో ఎకరాకు రూ.20 నుండి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చులవుతున్నందున ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని అన్నారు.