సిరాన్యూస్, సైదాపూర్
* లస్మన్నపల్లిలో బీజేపీ నాయకుల ఇంటింటా ప్రచారం
సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో సోమవారం బీజేపీ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో మోడీ ఉంటేనే అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు తలారి యాదగిరి, ఇరుమల్ల శాంతి స్వరూప్ రెడ్డి, కనకం ఉపేందర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.