Bjp Adilabad: ఇండియా కూటమి ఎంపీలపై జీవిత కాలపు నిషేధం విధించాలి…

సిరా న్యూస్, ఆదిలాబాద్: 

ఇండియా కూటమి ఎంపీలపై జీవిత కాలపు నిషేధం విధించాలి…

భారత ఉపరాష్ట్రపతిని అవహేళన చేసిన ఇండియా కూటమి ఎంపీలపై జీవిత కాలపు నిషేధం విధించాలని, బిజెపి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ వకుళాభరణం ఆదినాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ లో బిజెపి నాయకులతో కలిసి నల్ల కండువాలతో నిరసన తెలియజేశారు. ఎంపీలు రాష్ట్రపతిని అవమానిస్తుంటే రాహుల్ గాంధీ వీడియో తీస్తూ నిలబడటం దురదృష్టకరమని అన్నారు. కూటమి ఎంపీల ఈ చర్యలను బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతిని అవమానించడం అంటే యావత్ భారతదేశాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ విజయ బోయర్, పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, ప్రధాన కార్యదర్శి వేదవ్యాస్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, దినేష్ మాటోలియా, జోగురవి, సోమరవి, ఆకుల ప్రవీణ్, రాజేశ్వర్, కృష్ణ యాదవ్, గొర్ల రాము, ఇతర బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *