సిరా న్యూస్,హైదరాబాద్;
మన లోక్ సభ ఎన్నికల ఫలితాలు సమీక్షిస్తుంటే.. 303 సీట్ల నుంచి 240 కి పడిపోవడం వల్ల బీజేపీ పూర్తిగా దెబ్బతిన్నదన్న భావన మీడియాలో వస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందా? అని విశ్లేషిద్దాం.. 63 సీట్లు కోల్పోయి.. ఓట్లు మాత్రం 0.7 శాతం మాత్రమే కోల్పోయింది.2019 తో పోల్చితే.. 2024లో 9 రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది..తెలంగాణ , ఏపీ, పంజాబ్, తమిళనాడు , ఒడిశాలో గణనీయంగా ఓట్ల శాతాన్ని బీజేపీ పెంచుకోగలిగింది. సీట్లు కొన్నింట్లో గెలవగలిగింది.. మిగతా వాటిల్లో కాదు.. ఏపీలో టీడీపీ, జనసేన వల్ల బీజేపీకి ఓట్లు వచ్చాయి. తెలంగాణలో స్వతంత్రంగా ఎదిగింది. ఒడిశాలో అయితే గవర్నమెంట్ ను ఫాం చేయడం విశేషం.ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. తెలంగాణలో 35 శాతం సీట్లు సంపాదించింది. గతంలో 19.5 శాతం మాత్రమే కావడం గమనార్హం.నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – ఎన్డీఏ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి 400 కుపైగా సీట్లు సాధిస్తామని కూటమి నేతలు పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇక బీజేపీ సొంతంగానే 370 సీట్లలో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే ఫలితాల వరకు వచ్చేసరికి మాత్రం.. బీజేపీ ఆ స్థాయి దూకుడును ప్రదర్శించలేకపోయింది. ఈ క్రమంలోనే బీజేపీ సొంతంగా లోక్‌సభలో మెజార్టీ మార్కును అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటివరకు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈసారి ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇక గత 2 ఎన్నికల్లో దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన బీజేపీ.. ఈసారి మాత్రం బాగా మెరుగైంది. కర్ణాటకలో ఉన్న 28 స్థానాల్లో 16 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మిత్రపక్షం జేడీఎస్ పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి దానికి రెట్టింపు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తెలంగాణలోని 17 స్థానాల్లో బీజేపీ 8 నియోజకవర్గాల్లో తన హవా కొనసాగిస్తోంది. కేరళలో బోణీ కొట్టిన కమలం పార్టీ రెండు స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగించింది,