సిరాన్యూస్, ఆదిలాబాద్
మహానేత పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్
దేశం కోసం జీవితాన్ని ఆర్పించిన మహానేత పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీనదయాల్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటిస్తు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ మాట్లాడుతూ తన జీవితాన్ని దేశ సేవ కోసమే దీనదయాల్ అర్పించారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్లో కొనసాగిన ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి జన సంఘ్ ను స్థాపించారన్నారు. నేడు బీజేపీ ఈ స్థానంలో ఉందంటే వారి కృషి చాలా ఉందన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూసేల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ఉందన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యయ ఆశయ సాధన దిశగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాంపెల్లి వేణుగోపాల్, లాల మున్న, విజయ్, మయూర్ చంద్ర , వేదవ్యాస్, ముకుంద్, విజయ్, మయూర్ చంద్ర, ఆకుల ప్రవీణ్, క్రిష్ణ యాదవ్, జోగు రవి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.