సిరాన్యూస్, గుడిహత్నూర్
ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట జడ్పీటీసీ ధర్నా
ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట జడ్పీటీసీ ధర్నా చేపట్టిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 86 చెక్కులు లబ్దిదారులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక బీజేపీ ఎంపీటీసీ లను, తహసీల్దార్ కార్యాలయ అధికారులు పిలవలేదని గుడిహత్నూర్ జడ్పీటీసీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ ఎంపీడీఓ కార్యాలయ ద్వారం ముందు శుక్రవారం ధర్నానిర్వహించారు. ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని, తమ ఎంపీటీసీ లను ఎందుకు పిలవలేదని తహసీల్దార్ కవిత రెడ్డి ని నీలాదీశారు.ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూస్తానని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం లో భరత్, శివ,లక్ష్మిన్ కుమార్, జగన్, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు