BJP Gummadi Bhim Reddy: సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడి భీంరెడ్డి

సిరాన్యూస్, గుడిహ‌త్నూర్‌
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడి భీంరెడ్డి

మండలంలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మడి భీంరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహ‌త్నూర్‌ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశానికి ఆయన ఇంచార్జీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నాయకులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా 12కోట్ల సభ్యత్వాలతో బీజేపీ నిలిచిందని, ఈసారి జాతీయ పార్టీ గతం కంటే రెండింతలు చేసి 25కోట్ల సభ్యత్వాలు లక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నారు. మండలంలో గల ప్రతీ పోలింగ్ బూత్ నుండి 250 సభ్యత్వాలను చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం పోలింగ్ బూత్ వారీగా ఇంచార్జీలను నియమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు నారాయణ, మండల ఉపాధ్యక్షుడు సాబ్లే కేవల్ సింగ్, బీజేవైఎం జిల్లా నాయకుడు బాక్రే లక్ష్మణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చెట్ పల్లి వెంకటేష్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు లింగంపల్లి సురేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రాంగుడ్ల సురేష్, మైనారిటీ మోర్చా మండల అధ్యక్షుడు అబ్దుల్ జమీర్, మండల కార్యదర్శులు బాక్రే శేఖర్, జాదవ్ భీంరావ్, ఎంపీటీసీలు మండాడి కృష్ణ, భీంరావ్, మాజీ ఎంపీటీసీ కోట్నక్ కోటేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి దుత్పాల రంజిత్, మండల కార్యవర్గ సభ్యుడు మొరుగు శ్రీధర్ రెడ్డి, గిరిజన మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిడం సంతోష్, నాయకులు సాబ్లే కైలాష్, కమల్ సింగ్, సాబుల్ ప్రేంసింగ్, రాజేందర్ రెడ్డి, సరసాని మహేందర్ రెడ్డి, ఏరు రాజేశ్వర్, చిమ్మన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *