సిరాన్యూస్, జైనథ్
సభ్యత్వ నమోదు చేపట్టాలి :బీజేపీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్
పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని బీజేపీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా
జైనథ్ మండలంలోని నిరాల గ్రామంలో త్రినేత్ర గార్డెన్ లో భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మోదీ నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రతీ కార్యకర్త వారి,వారి గ్రామాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. ప్రజలకు మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ,అందిస్తున్న పథకాలను గురించి వివరించాలని తెలిపారు. సభ్యత్వ నమోదు గతం కంటే ఈసారి భారీ స్థాయిలో పెంచాలన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, మాజీ ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దంతెల రవీందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.