సిరాన్యూస్, ఖానాపూర్
జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్
ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్, మండల అధ్యక్షులు టేకు ప్రకాష్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనంలో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు దేశం కోసం ధర్మం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పడాల రాజశేఖర్ ,ప్రొద్దుటూరు గోపాల్ రెడ్డి ,కొండవేని రమేష్ ,దాసరి శ్రీనివాస్ ,పెద్ది రమేష్, ఇనుముల స్వామి ,వేల్పుల నవీన్ ,మేకల నర్సయ్య, ఐనవేని సాయి ,బాల సంకుల సాయి, తదితరులు పాల్గొన్నారు.
జగన్నాథ్ చౌక్ లో సామూహిక జనగణమన…
ఖానాపూర్ పట్టణంలోని స్థానిక జగన్నాథ్ చౌక్ లో సామూహిక జనగణమన ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా విజేత హై స్కూల్, కేరళ మోడల్ హై స్కూల్, ఈసీఇ హై స్కూల్, విద్యార్థులు సామూహిక జనగణమన గీతాలపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు న్యాయని సంతోష్, మండల అధ్యక్షులు టేకు ప్రకాష్, కొండవీని రమేష్, దాసరి శ్రీనివాస్, గడ్డం కిషన్ రెడ్డి, విజేత స్కూల్ డైరెక్టర్, ముదిరి శ్రీనివాస్, పడాల రాజశేఖర్, బిజెపి సీనియర్ నాయకులు పొద్దుటూరి గోపాల్ రెడ్డి, పిట్టల భూమన్న, బొ ప్పారపు సత్యవతి, పుప్పాల ఉపేందర్, ఇనుముల స్వామి, జ్యోతి, నరసయ్య, పరమేష్ గౌడ్, గట్టు శ్రీనివాస్, నారవేమి సాయి, మేకల నరసయ్య, మర్రి గంగారం, సోమారపు సాయన్న, బాల సంకుల సాయి, వివిధ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.