సిరాన్యూస్, భీమదేవరపల్లి
అక్రమ కేసులకు భయపడేది లేదు : బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్
అక్రమ కేసులకు భయపడేది లేదని భీమదేవరపల్లి బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమవారం బీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గత 6 నెలల క్రితం పీవీ నరసింహారావు భారతరత్న వచ్చిన సందర్భంగా భీమాదేవరపల్లి మండలం వంగర గ్రామం లో పీవీ నర్సింహా రావు ఇల్లు ను సందర్శించి వెళ్తున్నా సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడుగుడ్ల దాడి చేశారని తెలిపారు. తదనంతరం భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారన్నారు. అధికార పార్టీ బలంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చెయ్యడం జరిగిందని చెప్పారు. అక్రమ కేసులకు ఏ రోజు భయపడేది లేదని, గతంలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కేసులు మాపై పెట్టడం జరిగిందన్నారు. జైలు కూడా పోయిన రోజులు ఉన్నాయి. మాపై ఎన్ని కేసులు పెట్టిన ప్రజల పక్షాన కొట్లాడుతామని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందే వరకు కొట్లాడుతామని తెలియజేశారు. ప్రశ్నించే గొంతుకలను అనగాతోక్కలని చూస్తే మీ పార్టీ ని ప్రజలు పాతలంలోకి తోక్కి పెడుతారని హెచ్చరించారు. సమావేశంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఊసకోయిల కిషన్, మండల ప్రధానకార్యదర్శి గుండెల్లి సదానందం, శ్రీరామోజు శ్రీనివాస్, బైరి సదానందం, బండారి కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.