సిరాన్యూస్, ఓదెల
పొన్నం ప్రభాకర్ తన పదవీకి రాజీనామా చేయాలి : బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ప్రాధమిక పాఠశాల శిధిలవ్యవస్థ లో ఉన్న పాఠశాల ను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు గత 40 సంరాల క్రితం కట్టించిన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న బడిలో విద్యార్థులకు ప్రమాదం జరుగుతే పట్టించుకునే నాథుడే లేడని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించడం జరిగింది. ఆ స్కూల్ స్లాబ్ లో ఉన్నా పిచ్చులు ఉడిపోతున్నాయని, ఇనుప రాడ్డులు తుప్పు పట్టి నుజ్జు నుజ్జు అవుతే కూడా పట్టించుకోకుండా భీమదేవరపల్లి మండలంలో రోడ్లు మరమ్మతులు చేస్తున్నాం గతంలో కంటే ఇప్పుడు రోడ్లు నిధులు ఎక్కువ వచ్చాయి అని ప్రజలను మంత్రి పొన్నం ప్రబాకర్ మభ్యపెడుతున్నారన్నారు. అసలు రోడ్లే లేని నరహరి తండకు రోడ్డు ఎందుకు వెయ్యాలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లను వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల సమస్యలను తీర్చకపోతే వెంటనే రాజీనామాకు సిద్ధం కావాలని అన్నారు . కార్యక్రమం లో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఊసకోయిల కిషన్, మండల ప్రధాన కార్యదర్శులు గుండెల్లి సదానందం, శ్రీరామోజు శ్రీనివాస్, దొంగల వేణు, అంబిర్ కవిత, దొంగల రాణా ప్రతాప్, అయిత సాయి, బైరి సదానందం, గద్ద రాజేందర్, సోప్పరి నవీన్, అలుగు భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు