సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల వసతి గడులపై జీఎస్టీ విధించడానికి నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమైందని ఆరోపించారు. వసతి గదుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని వాటిపై జిఎస్టి ఎలా విధిస్తారని ప్రశ్నించారు. వసతి గదుల కిరాయిని తగ్గించి జిఎస్టి విధించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని, వాటిపై విచారణ జరిపించాలని, అభివృద్ధి పేరిట రాజేశ్వర పురం ధర్మశాలలను కూల్చివేసి, వ్యర్థాలను గుడి చెరువులో నింపి ఇంజనీరింగ్ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జీఎస్టీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికైనా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని లేనిపక్షంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు