సిరా న్యూస్,వరంగల్;
బీజేపీ వరంగల్ అభ్యర్ది ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కావ్య మతంపై హాట్ కామెంట్స్ చేసారు. ఎస్సి రిజర్వేషన్ లో మహ్మద్ కావ్య నాజీరుల్లా ఎలా పోటీ చేస్తారు.. గుంటూరుకు చెందిన మహ్మద్ కావ్య నాజీరుల్లా కు వరంగల్ కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. గుంటూరు కోడలు కావాలా…? ఓరుగల్లు కొడుకు కావాలా అని అడిగారు. వరంగల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.