మొదటి షో నుండి ఆకట్టుకుంటున్న హనుమాన్
ప్రశాంత్ వర్మ , తేజ సజ్జా దర్శకత్వంలో హనుమాన్
సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందంటున్న అభిమానులు
టెక్నికల్ గా టాప్ నాచ్ మార్కులు అందుకుంటున్న హనుమాన్
సిరా న్యూస్;
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన చిత్రం హనుమాన్ . విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ బజ్ ను సంపాదించుకుంది చిత్రం . ముఖ్యంగా థియేటర్లన్నీ జై శ్రీరామ్ , జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోయాయి. దర్శకుడి టేకింగ్ , వీఎఫ్ ఎక్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అభిమానుల నుండి విశేషణ ఆదరణ లభిస్తుంది . ముఖ్య పాత్రల్లో నటించిన వరలక్ష్మీ సరత్ కుమార్ నటనకు మంచి మార్కులు లభిస్తున్నాయి . హనుమాన్ ఆదర్శంగా తీసుకుని దర్శకుడు సైన్స్ అందులో జోడిస్తూ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పచ్చు . సినిమాటోగ్రఫీ తో అన్ని విషయాల్లో అటు టెక్నికల్ గా ఇటు రైటింగ్ పరంగాను టాప్ నాచ్ చిత్రంగా నిలిచింది హనుమాన్ . సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు మూవీ చూసిన ప్రేక్షకులు.