నేరడిగొండ, సిరా న్యూస్
రక్తదానం మహాదానమని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ జనరల్ సెక్రెటరీ బలరాం జాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు. రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. సుమారు 87 మంది రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాల వైపు యువత అడుగు వేయాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే ఎంతో బాగుంటుందని తెలిపారు.