పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ
సిరా న్యూస్,సిద్దిపేట;
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం గ్రీవెన్స్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ప్రారంభించారు. పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలు యువకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. విధినిర్వహణలో అమరులైన పోలీసు వీరులను ఈ సమాజం ఎప్పుడూ గుర్తుకు ఉంచుకుంటుందని తెలిపారు, వారి యొక్క అడుగుజాడల్లో నడచి వారి యొక్క ఆశయ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు, ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు, రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందించడం గొప్పతనమని రక్తదానం ప్రాణదానంతో సమానమని.
అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మ నిస్తుందని అన్నారు. ఒక్క రక్తదానంతోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం సాధ్యమవుతుందన్నారు, ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుందన్నారు. కులమత భేదం లేనిది, కృత్రిమంగా తయారు చేయలేనిది కాబట్టే రక్తానికి వున్న విలువ చాలగొప్పది. అటువంటి రక్తాన్ని దానం చేసి రక్త ప్రధాతలుగా నిలవండి అన్నారు. రక్తదానం చేసిన పోలీస్ అధికారులు సిబ్బంది మరియు యువకులను అభినందించారు. ఏ జిల్లాలో లేని విధంగా సిద్దిపేట జిల్లాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆపదలో ఉన్నవారికి పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతినిత్యం ఎవరో ఒకరు రక్తం దానం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 62 యూనిట్ల రక్తం సేకరించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు కు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, చేర్యాల సిఐ శ్రీను, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ప్రసాద్, ధరణి కుమార్, రాజేష్, విష్ణు ప్రసాద్, మరియు ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పట్టణ యువకులు తదితరు తదితరులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఇంచార్జ్ డిఎంహెచ్వో ఆనంద్, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ శ్రావణి, మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *