సిరాన్యూస్, బోథ్
బోథ్‌లో ప్రారంభమైన విత్తనాల విక్రయాలు
అక్షయ తృతీయ ను పురస్కరించుకొని మండలంలో వ్యాపారులు విత్తన విక్రయాలు ప్రారంభించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పలువురు వ్యాపారులు పత్తి విత్తనాలను విక్రయించారు. రైతుల సైతం అక్షయ తృతీయ రోజున విత్తనాలు కొనుగోలు చేస్తే పంట దిగుబడి వస్తుందన్న నమ్మకంతో విత్తనాలు కొనుగోలు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో సైతం విత్తనాల విక్రయాలు ప్రారంభించారు. కొంతమంది బంగారం కొనుగోలు సైతం చేపట్టారు.