BOATH: సిరిసిల్ల రాజయ్యను క‌లిసిన‌ బోథ్‌ కాంగ్రెస్ నాయకులు

సిరా న్యూస్, బోథ్‌
సిరిసిల్ల రాజయ్యను క‌లిసిన‌ బోథ్‌ కాంగ్రెస్ నాయకులు

ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వర్ష సీఈవోగా పని చేసి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఎంపీగా గెలుపొంది ఆ తర్వాత రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించబడ్డ సిరిసిల్ల రాజయ్యను శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం ఆయ‌న‌ను ఘ‌నంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోథ్‌ అభివృద్ధి కోసం రాజయ్య హయాంలో ఎన్నో నిధులు మంజూరు చేశారని, ఈసారి బోథ్‌ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మాజీ చైర్మన్ గొర్ల రాజు యాదవులు కోరారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పి చంటి, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కొమరం కోటేశ్వర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *