సిరాన్యూస్, బోథ్
మొలకెత్తిన పత్తి విత్తనాలు.. రైతుల హర్షం
విత్తనాలు వేసిన రైతులు ఆశలు మొలకెత్తాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పంటలకు అనుకూలంగా వర్షాలు కురియడంతో నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి. గత వారం రోజుల క్రితం విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. అయితే కరుణించిన వరుణుడు గత రెండు రోజుల నుండి పంటలకు అనుకూలంగా వర్షాలు కురిపించడంతో నాటిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి అయితే మొదట నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో కొంతమంది రైతులు ఆందోళన గురై మరోసారి విత్తనాలు నాటారు. అయితే శుక్రవారం కురిసిన వర్షంతో నాటిన విత్తనాలతో పాటు మరోసారి నాటిన విత్తనాలు మొలకెత్తడం జరిగింది. గుబురుగా విత్తనాలు మొలకెత్తడంతో దట్టంగా మొక్కలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది రైతులు దట్టంగా మొక్కలు ఉన్నచోట వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా పుడమి తల్లి ఒడిలోనే ఒదిగిపోతుందనుకున్నా అంకురం భూమిని చీల్చుకొని పైకి వచ్చి మొక్కగా కనిపిస్తుండడంతో రైతు సంబరపడుతున్నారు. ఏది ఏమైనా రెండుసార్లు విత్తనాలు నాటిన రైతులు ఆదివారం తమ తమ చేలకు వెళ్లి చూడగా విత్తనాలు మొలకలుగా కనిపించడంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు.