సిరాన్యూస్, బోథ్
బోథ్ పట్టణంలో మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి
* సమస్యలపై గ్రామ సభ
బోథ్‌మండల కేంద్రంలో మంచినీటి సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు బుధవారం నాడు జరిగిన గ్రామ సభకు సెక్రెటరీ అంజయ్య అధ్యక్షత వహించగా ఎంపీడీవో రమేష్ ఉపాధి హామీ ఏపీవో జగదే రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి , ఎంపీటీసీ కురుమే మహేందర్, విడిసి అధ్యక్షులు జి గంగాధర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని మిషన్ భగీరథ ద్వారా వేసిన పైపులైన్లను మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ పాఠశాలలో మరమ్మతులు చేపట్టాలన్నారు. వర్షాకాలం నీరు నిలుస్తుందని ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టాలని కోరారు.తరచుగా మిషన్ భగీరథ పైపులు లీకేజీలు అవ్వుతున్నాయని, వాటిని చేయించాలా అని కోరారు. వర్షాకాలం కలుషిత నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అంతేగాక అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని పట్టణంలో తిరిగే పశువులను కట్టడి చేయాలని పలువురు కోరారు. గ్రామపంచాయతీ వారు పశువులకు 2000 జరిమానా విధించి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో పట్టణానికి చెందిన పలువురు పాల్గొన్నారు.