సిరా న్యూస్, బోథ్
మేకలపై వీధి కుక్కలు దాడులు
ఆదిలాబాద్ బోథ్ మండల కేంద్రంలో వీధి కుక్కల స్వైర విహారం పెరిగిపోతున్నది. గత మూడు నెలల క్రితం వీధి కుక్కలు దాడులకు పాల్పడడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. అయితే తాజాగా శనివారం ఉదయం మేకలపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్లపై తిరిగే వీధి కుక్కలు మేకలపై దాడులు ప్రజ చేస్తున్నాడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వీధి కుక్కలను కట్టడి చేయాల్సి ఉంది.