సిరా న్యూస్,బోథ్
బాధితుడికి సెల్‌ఫోన్‌ను అప్పగించిన ఆర్టీసీ డ్రైవర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల నుండి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులో ప్రయాణికుడు సెల్‌ఫోన్ ను పోగొట్టుకున్నాడు. పోయిన ఫోను సంబంధిత బస్సు డ్రైవర్ కు దొరకగా నిర్మల్ డిపో కంట్రోలర్ జి ఆర్ రెడ్డి కి డ్రైవర్ అందజేశారు. సెల్ ఫోన్ ఎవరిది అని ఆరా తీసి సంబంధిత ప్రయాణికుడికి శనివారం అప్పగించారు. డ్రైవర్ నిజాయితీని పలువురు అభినందించారు.