సిరాన్యూస్, బోథ్
విద్యుత్ కోతలపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
* వాడివేడిగా బోథ్ మండల సర్వసభ్య సమావేశం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తుల శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.చివరిది కావడంతో సమావేశానికి ఎంపీటీసీల తోపాటు జెడ్ పి టి సి డాక్టర్ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి , సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్ , మండల ఉపాధ్యక్షులు బాబూలాల్, ఎంపీడీవో రమేష్ తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో విద్యుత్ కోతలపై సభ్యులు ఆగ్రహం వ్యక్తపరిచారు. విద్యుత్ కోతలు అధికంగా ఉంటున్నాయి అన్నారు. అంతేగాక ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, పంట రుణమాఫీ పై వాయిదాలు వేస్తుందని సభ్యులు వాపోయారు. వర్షాకాలంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి తగు సూచనలు చేయాలని కోరారు. సమావేశం రైతుబంధు, రైతు రుణమాఫీ, విద్యుత్ కోతలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా సమావేశంలో తాగునీటి సరఫరా పై చర్చ కొనసాగింది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి పైపులకు లీకేజీలు ఉన్నాయని, వాటిని పూడిచివేయాలని సభ్యులు కోరారు. స్పందించిన ఏ ఈ కళ్యాణ్ మాట్లాడుతూ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వారికి వివరిస్తామన్నారు. సమావేశంలో మండల విద్యాధికారి భూమారెడ్డి ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయని రిలీవర్ రాకుంటే ఇక్కడ నుండి ఉపాధ్యాయులను విడిచి పెట్టేది లేదని వివరించారు. ఎంపీపీ తుల శ్రీనివాసులు కల్పించుకొని విద్యార్థుల చదువుల ఆటకం కలుగకుండా చూడాలన్నారు. సమావేశంలో సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల నిర్వహణకు గాను కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పూర్తి కాగానే పాఠశాలల తరహాలో కేంద్రాల నిర్వహణ ఉంటుందని వివరించారు. ఉపాధి హామీ ఏపీ ఓ జగదే రావు మాట్లాడుతూ ప్రభుత్వం కూలి రేట్లు పెంచడంతోపాటు ఉపాధి హామీ పనులను వేగవంతంగా చేపట్టడం వల్ల ఈ ఏడాది కూలీల సంఖ్య పెరిగిందన్నారు. అంతేగాక ప్రతివారం కూలి డబ్బులు పడడంతో కూలీలు ఉత్సాహంగా పనిచేయడం జరిగిందన్నారు. ఇందిరా క్రాంతి ఏ పీ ఓ మాధవ్ మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా ముందు ఉంచేందుకు గాను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని అంతేగాక మండలంలోని దన్నూర్ గ్రామంలో మహిళా సమాఖ్యకు మీసేవ కేంద్రాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారి డి ఈ సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలో తమకు సరైన సిబ్బంది లేకున్నా రోడ్ల మెరుగుపరుస్తున్నామన్నారు. ఇప్పటికే బోత్ సమీపంలోని కరెంట్ వాగు వంతెన పూర్తి చేసి రహదారి సౌకర్యం కల్పించామన్నారు భవిష్యత్తులో నిధులు మంజూరు అయితే మరిన్ని రహదారులు పూర్తి చేస్తామన్నారు సమావేశంలో ఎస్సిఆర్పి విట్టల్ రావు మాట్లాడుతూ నాలుగు ఆశ్రమం ఉన్నాయని వివిధ పాఠశాలల్లో 912 మంది విద్యార్థులు చదువుతున్నారు అన్నారు. విద్యార్థులు లేక లక్ష్మీపూర్, సుర్జాపూర్ పాఠశాలలో మూతపడ్డాయని వివరించారు.