సిరాన్యూస్,బోథ్
భూముల పట్టాల కోసం తరలివచ్చిన రైతులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ తహసీల్దార్ కార్యాలయం సోమవారం జన సందోహంతో నిండిపోయింది. వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు వస్తుందని, అంతకంటే ఎక్కువగా ఉంటే రైతుబంధు ఇవ్వరని ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. తమ భూములను కుటుంబీకులకు రిజిస్ట్రేషన్ పట్టా చేసి ఇచ్చేందుకు తీసుకువచ్చారు. రైతులు ముందు చూపుగా తమ తమ కుటుంబాల వారికి పట్టా చేయించారు.