సిరాన్యూస్, బోథ్
బోథ్‌లో ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి రాజు యాదవ్‌లు మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా, జిల్లా ఇన్చార్జి మంత్రిగా సీతక్క జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. నేటి రాజకీయాల్లో ప్రతినిత్యం జనం కోసం పని చేసే నాయకులకు ఆదరణ ఉంటుందని, అందులో మంత్రి సీతక్క ఒకరని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు పేదలకు అండగా నిలిచి, మాట తప్పకుండా నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ లోనపు పోశెట్టి, వీడిసి అధ్యక్షులు జి గంగాధర్, మాజీ వార్డు సభ్యులు షేక్ షాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు భోజన్న, శేఖర్ మైనారిటీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ హసీఫ్ లు పాల్గొన్నారు.