సిరా న్యూస్,బోథ్
పెరుగుతున్న వైరల్ జ్వరాల బాధితులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో వైరల్ జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ జ్వరాలతో పాటు మలేరియా, జ్వరాల ఉధృతి కొనసాగుతున్నది. వ్యాధుల తీవ్రత వల్ల ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాల్లో దోమల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణకు కొన్ని గ్రామపంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్ లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు వెనకంజలో ఉన్నాయి. అనేక గ్రామపంచాయతీలకు ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏది ఏమైనా అధికారులు పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయాలని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.