సిరాన్యూస్, బోథ్
బోథ్‌లో ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా పల్లకి ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాయిబాబా భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపు కొనసాగిం.ది ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుండి సాయి భక్తులు పాల్గొన్నారు.