సిరా న్యూస్, బోథ్
బోథ్ అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన వజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు గూడేలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరాను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ గురువారం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ ప్రభుత్వం త్రీఫేస్ విద్యుత్తును తమ గ్రామాలకు ఏర్పాటు చేస్తామంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్ భూమన్నతో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.