boath:రెంటల్ చెల్లించ‌ని ఇసుక లారీ

సిరాన్యూస్,బోథ్‌
రెంటల్ చెల్లించ‌ని ఇసుక లారీ
* ప‌ట్టించుకోని ఇరువురు అధికారులు
* మాది కాదంటే.. మాది కాదంటున్న చేతులు దులుపుకున్న అధికారులు

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డాం నిర్మాణం కోసం నిర్మల్ ప్రాంతానికి చెందిన ఓ లారీ యజమాని జీరో ఎలాంటి రెంటల్ కట్టకుండానే ఇసుక లారీని తీసుకువచ్చాడు. రెంటల్ కట్టకుండా 60 టన్నులతో వచ్చిన లారీ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు లారీని అడ్డుకున్నారు. అంతేగాక ఎలాంటి రెంటల్ కట్టకుండా ఇసుకకు సంబంధించి పత్రాలు లేకుండా ఇసుకను తీసుకువచ్చిన లారీ విషయమై మైనింగ్ అధికారులకు, స్థానిక పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు, స్థానికులు సమాచారం అందించారు. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో త‌హ‌సీల్దార్‌ లారీ విషయమై పోలీసులకు సమాచారం ఇస్తామని వారు లారీని స్వాధీనం చేసుకుంటారన్నారు. ఇక స్థానిక ఎస్సై కి ఫిర్యాదు చేయగా ముందుగా ఇరువురు పోలీసులను పంపించి లారీ వద్ద ఉండాలని చెప్పి మరో 15 నిమిషాల తర్వాత ఎస్సై అక్కడికి చేరుకున్నారు. అంతకుముందే మైనింగ్ అధికారులు ఆదిలాబాద్ నుండి కారులో వచ్చి ఇసుకతో వచ్చిన లారీని పరిశీలించి పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే లారీని తీసుకువచ్చిన డ్రైవర్ అక్కడినుండి పారిపోయారు. లారీ దగ్గరకు చేరుకునే ఎస్ఐ మైనింగ్ అధికారులతో చర్చించారు. లారీని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్దామని మాట్లాడారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న లారీ యజమానులతో ఇసుక లారీని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా లారీ స్టార్ట్ కాలేదు. దీంతో మైనింగ్ అధికారులు అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది స్థానిక పోలీసులు సైతం లారీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఖాళీ అయిన తీసుకొని అక్కడే ఉంచి పట్టుబడిన లారీని సోమవారం మూడు గంటల ప్రాంతంలో అక్కడి నుండి సదరు లారీ యజమాని తీసుకువెళ్లినట్లు సమాచారం ఏది ఏమైనా దొంగచాటుగా వచ్చిన ఇసుక లారీని ఇరు శాఖల అధికారుల కళ్ళముందే కనిపించిన లారీ చేజారిపోవడం చర్చనీయాంశంగా మారింది. మైనింగ్ అధికారులు లారీని పోలీసులు స్వాధీనం చేసుకుంటారని పేర్కొంటుండగా పోలీసులు మాత్రం మైనింగ్ అధికారులు మాకు అప్పచెప్పలేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా లారీ అక్కడి నుండి తీసుకువెళ్లడం వెనుక ఎవరి హస్తం ఉందనేది జిల్లాస్థాయి అధికారులు విచారణ జరిపితే తెలిసిపోతుందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఖాళీ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *