సిరాన్యూస్, బోథ్
రోడ్లపైనే వ్యాపారాలు… వాహనదారులకు ఇక్కట్లు
* పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రోడ్లపైనే వ్యాపారులు కొనసాగుతున్నాయి. దీంతో రోడ్లపై నడిచే పాదాచాచార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రధాన రహదారిపై వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకొని దర్జాగా వ్యాపారాలు చేస్తుండగా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. అంతేగాక బస్టాండ్ ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపై దర్జాగా వ్యాపారం చేసుకుంటే అడిగే వారు లేకుండా పోయారని ద్విచక్ర వాహనదారులు,పాదాచారులు వాపోతున్నారు. ఓవైపు హోటల్లు, మరోవైపు హోటలలోకి వచ్చే వారు వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తూ ఉండడంతో వచ్చి పోయే వారికి ఈ రోడ్డుపైన ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం పూట పాదాచార్లకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామపంచాయతీ అధికారులు ఇకనైనా రోడ్లపై వెలుస్తున్న వ్యాపారాలపై కట్టడి చేయాల్సి ఉంది