Boath SI Ramulu: పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ వెతికి పట్టుకున్న పోలీసులు

సిరా న్యూస్, బోథ్‌:

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ వెతికి పట్టుకున్న పోలీసులు
+ బాధితుడి సెల్‌ఫోన్‌ను అందించిన ఎస్సై రాములు

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ పోలీసులు ఓ వ్యక్తి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికిపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… సొనాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ జనవరి 29న గ్రామంలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అనంతరం ఫిబ్రవరి 2న భోథ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, ఇదే విషయమై ఫిర్యాదు చేసారు. పోలీసులు వెంటనే ఈ సమాచారాన్ని సిఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో ఉంచగా, ఫిబ్రవరి 3 సెల్‌ఫోన్‌ దొరికింది. దీంతో ఎస్సై రాములు బాధితున్ని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి, పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను తిరిగి అందించారు. సెల్‌ఫోన్‌ చోరికి గురైనా.. లేదా పోగొట్టుకున్నా.. సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచితే తప్పక ట్రేస్‌ అవుట్‌ అవుతుందని ఎస్సై తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ రాంమూర్తి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *