Bojja Ashanna: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న
* ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపాలి
* ఆదిలాబాద్ క‌లెక్ట‌రేట్ ఎదుట కార్మికుల ధ‌ర్నా

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. అఖిల భారత సీఐటీయూ, రాష్ట్ర కమిటీపిలుపు మేరకు కార్మికుల కోర్కేల దినం సంద‌ర్బంగా బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత మాట్లాడారు.
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాల‌న్నారు. నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ రద్దు చేయాల‌ని, బొగ్గు బ్లాక్ లను వేలం వేయడానన్ని నిలుపుదల చేయాలని అన్నారు. సింగరేణి నేరుగా గనులు కేటాయించాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పరీక్ష రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. అంగన్వాడి, ఆశ,మధ్యాహ్నం భోజనం, ఐకెపి, వివో ఏ, వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీమ్ లలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి,లింగాల చిన్నన్న,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.నవీన్ కుమార్, అంగన్వాడి యూనియన్ నాయకులు సునీత,సుభద్ర, కళావతి,పంచశీల,లక్ష్మి ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నైతం శోభ,ఎం.సుజాత, ఆశ యూనియన్ నాయకులు లక్ష్మి పార్వతి,జ్యోతి, మీన, ఆశా, సుజాత, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు, కిరణ్, సోనేరావ్, సుందర్, శంకర్, దశరత్, మున్సిపల్ జిల్లా అధ్యక్షులు జనార్దన్, హాజ్జు,శ్యాం, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *