సిరాన్యూస్, చిగురుమామిడి
ఘనంగా బొమ్మనపల్లి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల 2007-2008 సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.పాఠశాలలో గడిపిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా గడిపారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము విద్య బోధనలు నేర్పిన విద్యార్థులు జీవితంలో మంచి స్థాయికి వెళ్లడమే తమకిచ్చే గురుదక్షిణ అని అన్నారు. మంచి స్థాయిలో జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. తమకు విద్య బోధనలు చెప్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ, రామ్ రెడ్డి, ఆనందం, కనకయ్య, వలి, లక్ష్మయ్య, కనుకయ్య, జమున, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.