సిరా న్యూస్, చిగురుమామిడి
బొమ్మనపల్లిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
స్వస్తి శ్రీ క్రోదినామ సంవత్సరం వైష్ణవ మాసం శుక్ల పక్ష వసంత రుతువు ఉత్తరాయణం మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఊరగుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. చిన్నారులు కోలాటం ఆడారు. స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు జంగా రాజయ్య శ్యామల, భక్త బృందం, మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.