Bommanapally: బొమ్మనపల్లిలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

సిరాన్యూస్‌, చిగురుమామిడి
 బొమ్మనపల్లిలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. బుధ‌వారం రాత్రి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించారు. బోనాలలో కాటి పడగల వారి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముదిరాజ్ కుల పెద్దలు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *