సిరాన్యూస్,ఓదెల
జమ్మికుంటలో పీఎం విశ్వకర్మ ఉచిత శిక్షణ కేంద్రం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పైన పీఎం విశ్వకర్మ ఉచిత శిక్షణ కేంద్రాన్నిఏర్పాటు చేసినట్లు శ్రీ టెక్నాలజీస్ ఇన్చార్జి బోనగిరి శ్రీధర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ముందుగా వడ్రంగి, దర్జీ వారికి 450 మందికి ఐదు రోజులు శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఉచిత శిక్షణలో శిక్షణ తీసుకున్న వారికి 15 వేల వరకు టు ల్ కిట్స్ , స్తైఫండ్ రోజుకు 500 రూపాయలు ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.మొదటి విడతగా ఎలాంటి హామీ లేకుండా లక్ష రూపాయల రుణం అందిస్తున్నట్లు, రెండో విడతగా 2 లక్షలు, మూడో విడతగా మూడు లక్షల రుణం ఎలాంటి హామీ లేకుండా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో నిరుపేద కుటుంబాలకు చెందిన చేతివృత్తులు దారులు పనిముట్ల గురించి పూర్తి అవగాహన తెలుసుకుంటున్నారు. ప్రతి చేతి వృత్తి దారులు ఆర్థికంగా ఎదగాలని శిక్షణలో పూర్తి విషయాలు తెలుసుకోవాలని శిక్షణ ట్రైనర్ చెబుతున్నారు. ఈ శిక్షణ కేంద్రంలో ట్రైనర్ లు గా కనకం సతీష్బో, నగిరి లావణ్య , ఎలగం సరిత, గోసికొండ మౌనిక, బోగ లత, కొలుగూరి అరుణ, రాజేష్. భువనగిరి, ఉదయ్ తదితరులు ఉన్నారు.