Borigama: బోరిగామలో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

సిరాన్యూస్‌, ఇచ్చోడ
బోరిగామలో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం కాంగ్రెస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రైతులు రుణమాఫి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రైతుల అప్పుల బాధలు గుర్తించారు. రుణమాఫీ ప్రకటించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని, రైతుల కోసం రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారనీ, రుణమాఫీ రైతులకు ఎంతో మేలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆసిఫ్ ఖాన్, కుంట ప్రవీణ్ రెడ్డి పారుఖ్, ఇట్టడి రమణారెడ్డి, ముస్కు గంగారెడ్డి రైతులు డేరే ముత్యం రెడ్డి, బోయిని శేఖర్, గాండ్ల నారాయణ, కుంట మోహన్ రెడ్డి, డేరే గంగారెడ్డి, బత్తుల నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *