రెండు గ్యారంటీలు పూర్తి

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు వినిపించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను.. ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. మహాలక్ష్మి పథకంతో పాటు చేయూత పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలు వయసుతో సంబంధం లేకుండా కిలోమీటర్ల పరిమితేమి లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని రేవంత్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో.. చేయూత పథకంలో భాగంగా.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం కోసం ఖర్చు పరిధిని రూ.10 లక్షలకు పెంచూతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కూడా అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ పథకం పూర్తి వివరాలివే..
చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!
ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం ఖర్చు పరిధి రూ.10 లక్షలకు పెంపు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నేటి నుంచి అమలు
2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి
గతంలో ఆరోగ్య శ్రీ పరిధి 5 లక్షలు మాత్రమే
నేటి నుంచి ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు వైద్యం చేసుకునే అవకాశం
రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు
293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు
ఆరోగ్య శ్రీ కింద అందుబాటులో ఉన్న 1,376 ఆపరేషన్లు, 289 వైద్య సేవలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *