సిరా న్యూస్, సోనాల
ఒకే యువతి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
* తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలిచాను
* బోయన్ పల్లి జ్యోతి
* పలువురు అభినందనలు
ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన బోయన్ పల్లి జ్యోతి ఒకటి.. రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోనాల గ్రామానికి చెందిన పేద కుటుంబం బోయిన్పల్లి రాములు లక్ష్మి దంపతులు వృత్తిరీత్యా చిన్నపాటి దుకాణంలో పూజా సామాగ్రి అమ్ముకొని జీవించే కుటుంబానికి చెందినవారు. వారి యొక్క మూడవ సంతానం అయిన బోయిన్పల్లి జ్యోతి గురుకుల విద్యాలయాల ఫలితాలలో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీజీటీ, పీజీటీ, జె ఎల్, డి ఎల్, ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యింది.జ్యోతి తన విద్యాభ్యాసాన్ని సోనాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల బజార్హత్నూర్ లో ఇంటర్మీడియట్, అక్కడే గల పద్మావతి డిగ్రీ కళాశాలలో తెలుగు లిటరేచర్ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు, తెలంగాణ యూనివర్సిటీలో బీఈడీ 2021 లో పూర్తి చేసి, సెట్ ఉత్తీర్ణత పొంది 2023 సంవత్సరంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల పరిధిలో సి ఆర్ టి తెలుగు సబ్జెక్టులో ఆదిలాబాద్ జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కేజీబీవీ నేరడిగొండలో ఉద్యోగం చేస్తున్నారు, గురుకుల విద్యాలయ నాలుగు ఉద్యోగాల నుంచి డిగ్రీ కళాశాల అధ్యాపక వృత్తిని ఎంచుకుంటను అని మీడియా కి తెలిపారు.తలిదండ్రులు కష్టపడి ఉన్నత చదువులు చదివించిన నేడు ఉద్యోగం రావడమే గగనమవుతున్న తరుణంలో ఒకే సారి నాలుగు ఉద్యోగాలు రావడముతో తలిదండ్రులు ఆనందపడ్డారు. సొనాల గ్రామము ఉద్యోగాలకు నిలయంగా మరోసారి రుజువైంది. అదిలబాద్ జిల్లాలో అత్యధిక ఉద్యోగాలు ఉన్న గ్రామంగా సోనాల గ్రామన్ని జిల్లా వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.ఇటీవల పోలీస్ ఉద్యోగాలు రావడం మళ్ళీ ఒకేసారి ఒకే అమ్మాయి నాలుగు ఉద్యోగాలు సాధించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.బోయన్ పల్లి జ్యోతి మాట్లాడుతూ తమ తల్లి తండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిల్లబెట్టుకోవడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది తెలిపారు.