సిరా న్యూస్,తిరుపతి;
దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
10-02-2024 ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం.
11-02-2024 ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి, పెద్దశేష వాహనం.
12-02-2024 ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం.
13-02-2024 ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం.
14-02-2024 ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం.
15-02-2024 ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం.
16-02-2024 ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం.
17-02-2024 ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం.
18-02-2024 ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంసవాహనం, ధ్వజావరోహణం.