సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం నుండి బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది. శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనాలను పరిశీలించారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.300గా నిర్ణయించగా, పదేళ్ల లోపు చిన్నా రులను ఉచితంగా అనుమతిస్తామని, ప్రతీ రోజూ ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా అందించనున్నట్లు, బ్రేక్ దర్శనం టికెట్లను ఆఫ్లైన్ తోపాటు ఆన్లైన్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.