సిరా న్యూస్, సైదాపూర్
బిజెపి కుట్రపూత వైఖరే
*-మండలపార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య
* కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ ఎస్ నాయకుల నిరసన
భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకురాలు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ వేన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రము లో భారత రాష్ట్ర సమితి మండల శాఖ అధ్వర్యంలో నిరసన తెలిపారు.ముందుగా రాష్ట్రంలో ఇడీ వచ్చిన తర్వాత మోడీ ఎన్నికల ప్రచారానికి వస్తారని బిజెపి కుట్రపూత వైఖరి మరోసారి బట్టపైయాల అయిందని అన్నారు.విచారణ అని చెప్పి అరెస్టు చేసి తీసుకెళ్లడం ఎంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ ఆడబిడ్డది దక్కిన గౌరవం ఇదేనా, ఇకనుండి అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండలపార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య,వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు బిల్లా వెంకటరెడ్డి,ఎంపీటీసీ తోంట ఓదెలు,మాజీ సర్పంచులు చంద శ్రీనివాస్, కొండ గణేష్, కొత్త రాజిరెడ్డి, మండల కొప్షన్ సభ్యులు ఎండీ ఇమామ్,భారత రాష్ట్ర సమితి మండల ప్రధాన కార్యదర్శి చెలమల్ల రాజేశ్వరరెడ్డి , సహకార సంఘం ఉపాధ్యక్షులు జి శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి గ్రామ అధ్యక్షులు గొల్ల పల్లి శ్రీనివాస్ , ఎస్కేఅయిలయ్య, పొడిశెట్టి శ్యామ్,ములుగు సంపత్, సీనియర్ నాయకులు పి.తిరుపతి గౌడ్, వర్నే మోహనరావు,పి రవీందర్ గౌడ్, టి.రజనీకాంత్, నరసింహా చారీ, చాడ ఆదిరెడ్డి, గుళ్ళ అశోక్, దూల సురేశ్, బి.అనిల్ కోమరయ్య, బి.జైపాల్, నిఖిల్, నరేష్ ,చింతల రవీందర్ లు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.