సిరాన్యూస్, ఖానాపూర్
బీఆర్ఎస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత డా.బాబు జగ్జీవన్ రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.