సిరాన్యూస్, ఓదెల
గణపతి పూజ చేసిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం 4 వ వార్డ్ జవహర్ నగర్ లో మంగళవారం గణపతి పూజలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు. ఈసందర్బంగా జవహర్ నగర్ ప్రజలు ఉష ని ఘనంగా స్వాగతించి శాలువాలతో సత్కరించారు. అనంతరం దాసరి ఉషా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలతో రైతులందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు కొండా రజిత, అముదాల అరుణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.