సిరాన్యూస్,గుడిహత్నూర్
గుడిహత్నూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కార్యకర్తలు మొక్కలు నాటారు. అనంతరం గుడిహత్నూర్ పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. ఈసందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల గౌడ్ మాట్లాడుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశానుసారం ఈ వేడుకలు జరిగాయని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు గ ఏదిగారాని ఇంత పెద్ద ఆదరణ పొందిన నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.