సిరా న్యూస్ (ఆదిలాబాద్): బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనథ్ మండలంలోని బోరజ్ గ్రామం నుండి సిర్సన్న, గూడా, రాంపూర్ గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున టపాసులు, డప్పు చప్పులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కాగా రాంపూర్, గూడా గ్రామాల్లో యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రాగా, ఎమ్మెల్యే జోగు రామన్నవారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జోగు రామన్నమాట్లాడుతూ… ఈ సారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకంలో భాగంగా రూ. 3 వేలు , ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యశ్రీ బీమా ద్వారా 15 లక్షలు, కుటుంబానికి 400వందాలకే గ్యాస్ సిలెండర్, రైతు బందు 16వేలు, అందరికి రూ. 5లక్షల బీమా వంటి పథకాలు అమలు చేస్తామని అన్నారు. కాగా మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించుకొని సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్, బిజెపి నాయకుల్లో ఓటమి భయం పట్టుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్శెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, యాసం నర్సింగ్, వేణు యాదవ్, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.