సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని తిప్పి కొట్టాలి: మాజీ మంత్రి జోగు రామన్న
* బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో చర్చ వేదిక
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తిప్పి కొట్టాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల బీ ఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న చర్చ వేదిక నిర్వహించి పలు సూచనలను తెలియజేశారు.రుణమాఫీలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే మరో పక్క కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకలు నిర్వహించడం హాస్యస్పదం అన్నారు.రైతులకు అందించాల్సిన రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. వ్యవసాయ పనులను మాని రుణమాఫీ అంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతులను మళ్లీ బాకీలా పాలు చేస్తుందన్నారు. రుణమాఫీ తో ఒకపక్క రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు నిర్వహించడం హాస్యస్పదంగా ఉందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం లక్ష రూపాయలు కూడా మాఫీ చేయడంలో విఫలమవుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా బ్యాంకుల నుండి తప్పుడు లెక్కలు తీసుకొని రైతులను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు… ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం బేసరత్తుగా రెండు లక్షల మాఫీచెయ్యని ఎడల, రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రోకండ్ల రమేష్, మార్శెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, లింగారెడ్డి, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, సేవ్వా జగదీష్,వేణుగోపాల్ యాదవ్,భోజన్న,తదితరులు పాల్గొన్నారు.