సిరాన్యూస్, కాల్వ శ్రీంపూర్
కాల్వ శ్రీంపూర్‌లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు
సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల బీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నినాదపురం దేవయ్య, వడ్నాల శ్రీనివాస్ ,సువర్ణ చందు, ఖాదర్ , సువర్ణ బిట్టు, తాత సాయికిరణ్ యాదవ్, చిలుముల రమేష్ ,శీను ,అధిక సంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.