BRS Kande Sudhakar: దౌర్జన్యంగా ముందస్తు అరెస్టులు: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కండే సుధాకర్

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
దౌర్జన్యంగా ముందస్తు అరెస్టులు: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కండే సుధాకర్

రాజకీయ విమర్శలే తప్ప రాజకీయ భౌతిక దాడుల సంస్కృతి లేని తెలంగాణలో నేడు కాంగ్రెస్ పాలనలో ఆగం అయిందని భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కండే సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం భీమదేవరపల్లి పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్భందించడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతో సాక్షాత్తు తమ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి రౌడీలను తీసుకొచ్చి ఇంటిని రాళ్లతో ధ్వంసం చేయడమే కాక భౌతికదారులకు పాల్పడం బాధాకరం అని అన్నారు. దీని పట్ల మాజీ మంత్రివర్యులు కేటీఆర్, హరీష్ రావు, ఖండించి నిరసనకు పిలుపునివ్వగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలను నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది నాటి సీమాంధ్ర నాయకుల పాలనలో చూసామని అన్నారు. ఆనాటి సీమాంధ్ర నాయకుల పాలన మళ్లీ గుర్తుకొస్తుంది.. దాడులను ఆపాల్సిన పోలీసులు రక్షణ కల్పించకపోవడం. దాడులకు వచ్చిన గుండాలకు మద్దతుగా ప్రేక్షక పాత్ర వహించడం, సిగ్గుచేటు ప్రజాస్వామ్యమా రౌడీల రాజ్యమా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పై దాడులు చేయడం సరియైన పద్ధతి కాదు, రాష్ట్ర ప్రజలు జరుగుతున్న పరిణామాలను అన్ని చూస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు చాలా మేధావులు, గిరి గీసి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు, జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం,, చోద్యం చూస్తున్నట్లుగా ఉంది. ఈ పరిస్థితి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ నల్లగొని రాజు, కాల్వ సంపత్ గిన్నారపు కుమారస్వామి, మంచాల శ్రీనివాస్, వేముల రమేష్ , గుర్రపు తిరుపతి, బత్తిని బాలయ్య, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *